40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: వరవరరావు భార్య హేమలత

By narsimha lodeFirst Published Aug 28, 2018, 3:23 PM IST
Highlights

40 ఏళ్లలో ఎప్పుడూ  ఈ తరహా  పరిస్థితిని తాను ఎప్పుడూ కూడ చూడలేదని విరసం నేత వరవరరావు భార్య హేమలత  అభిప్రాయపడ్డారు.  40 ఏళ్ల నుండి వరవరరావుపై అనేక కేసులు  నమోదైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు


హైదరాబాద్: 40 ఏళ్లలో ఎప్పుడూ  ఈ తరహా  పరిస్థితిని తాను ఎప్పుడూ కూడ చూడలేదని విరసం నేత వరవరరావు భార్య హేమలత  అభిప్రాయపడ్డారు.  40 ఏళ్ల నుండి వరవరరావుపై అనేక కేసులు  నమోదైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏనాడూ కూడ తమ ఇంట్లో ముందు రూమ్ నుండి  లోపలి గదిలోకి రాలేదన్నారు. కానీ,ఇవాళ  మాత్రం  ఇల్లు మొత్తం  అణువణువు గాలించారని ఆమె చెప్పారు.

మంగళవారం నాడు ఉదయం నుండే పూణే పోలీసులు వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు.సుమారు 8 గంటల  సోదాల అనంతరం పోలీసులు ప్రధానమంత్రి మోడీపై హత్య కుట్ర కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు తనకు చెప్పినట్టు  హేమలత మీడియాకు చెప్పారు.అరెస్ట్ చేస్తున్నట్టు చివరి నిమిషంలో ప్రకటించారని ఆమె చెప్పారు.

తమ ఇంట్లో అణువణువు గాలించారని చెప్పారు. ఇల్లంతా చిందరవందర చేశారని ఆమె చెప్పారు. గతంలో కూడ పలు కేసుల్లో అరెస్టైన సందర్భాల్లో  ముందు రూమ్ నుండి మాత్రమే పోలీసులు  వెళ్లిపోయారని ఆమె చెప్పారు. కానీ, ఇవాళ మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరు తనకు ఆశ్చర్యం కల్గించిందన్నారు.

20 మంది పోలీసులు వచ్చి తమ ఇంటిని సోదాలు చేశారన్నారు. తన ఫోన్‌తో పాటు  నా ఫోన్ ‌కూడ స్వాధీనం చేసుకొన్నారని  ఆమె చెప్పారు.  ఆరోగ్యం బాగా లేని విషయాన్ని తాను పూణె పోలీసులకు చెప్పినట్టు చెప్పారు. అయితే చికిత్స చేయిస్తామని  చెప్పారు.

ల్యాండ్ ఫోన్  కనెక్షన్ తీసేశారని చెప్పారు. ఆధార్ కార్డులను కూడ తీసుకెళ్లారని చెప్పారు. ఇంట్లో స్వాధీనం చేసుకొన్న వస్తువులకు సంబంధించిన లిస్ట్ ను తనకు అందించారని ఆమె చెప్పారు.  ప్రధాని మోడీని చంపేందుకు పన్నిన కుట్రకు సంబంధించిన దొరికినట్టు చెబుతున్న లేఖ నకిలీదని తనతో పాటు వరవరరావు కూడ చెప్పారని ఆమె గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే  8 గంటలకు పైగా  ఏమీ తినకుండా ఉండడంతో తన ఇంటికి వచ్చిన పోలీసులకు తానే టీ చేసి ఇచ్చినట్టు ఆమె  చెప్పారు.  తప్పుడు కేసులో వరవరరావును అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పూణె కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు తెలిపారని  ఆమె చెప్పారు.

ఈ వార్తలు చదవండి

మోడీపై హత్య కుట్ర కేసు: జర్నలిస్ట్ క్రాంతి అరెస్ట్

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్
పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

మోడీ హత్యకు మావోల కుట్ర: లేఖలో వరవరరావు పేరు

 

click me!