దసరాకు స్వంత ఊళ్లకు జనం: పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

By narsimha lodeFirst Published Oct 2, 2022, 9:45 AM IST
Highlights

దసరా పండుగను  పురస్కరించుకొని స్వంత ఊళ్లకు ప్రయాణీకులు బయలు దేరారు. దీంతో హైద్రాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. 

హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు ప్రయాణమయ్యారు.  దీంతో హైద్రాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజా వద్ద  ట్రాఫిక్ ను నియంత్రించేందుకు జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు చర్యలు తీసుకొంటున్నారు. టోల్ ఫీజు  చెల్లించేందుకు టోల్ గేటు వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 హైద్రాబాద్ నుండి  విజయవాడ వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ పెరిగింది. వారాంతంతో పాటు పండుగను పురస్కరించుకొని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి.   గత  రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో దసరా వేడుకలు సాదా సీదాగానే జరిగాయి. అయితే కరోనా ప్రభావం తక్కువ కావడంతో ఈ ఏడాది దసరా ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.

దసరాను పురస్కరించుకొని తమ స్వంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణీకులు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లకు చేరుకొంటుడండంతో రద్దీ నెలకొంది. పండుగకు స్వంత గ్రామానికి వెళ్లేందుకు ముందుగానే టికెట్లను రిజర్వ్ చేసుకున్న ప్రయాణీకులకు కొంత ఊరట నెలకొంది. అయితే టికెట్లు రిజర్వ్ చేసుకోని ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యం ప్రయాణీకుల నుండి ముక్కు పిండి చార్జీలు వసూలు చేస్తున్నారు.  ప్రతి రోజూ ఒక్కో ధరను వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.  నిన్న వసూలు చేసిన ధరఇవాళ ఉండడం లేదని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!