బ్రేకింగ్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు త‌ప్పిన పెను ప్ర‌మాదం.. !  

Published : Oct 01, 2022, 11:56 PM IST
బ్రేకింగ్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు త‌ప్పిన పెను ప్ర‌మాదం.. !  

సారాంశం

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు ఆటోను ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న కారుకు ఆటో ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి ప్రమాదం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. సజ్జనార్ మహారాష్ట్రకు వెళుతుండగా ధర్మారం క్రాస్ రోడ్ వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి అడ్డంగా రావడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో రామగుండం మండలం మల్యాల పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మి లకు తీవ్ర గాయాలు కాగా అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మి లకు స్వ‌ల్ప‌ గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంట‌నే పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి  ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కరీంనగర్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైనట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR