హైద్రాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం నాడు భారీగా ట్రాఫిక్ జాం అయింది. గంటల తరబడి వాహనదారులు రోడ్లపై నిరీక్షించాల్సినపరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం నాడు భారీగా ట్రాఫిక్ జాం అయింది. రోడ్లపైనే గంటలకొద్దీ వాహనదారులు న్నారు. సుమారు ఐదు కి.మీ. మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పంజాగుట్ట-ఎల్వీ ప్రసాద్, బేగంపేట-పంజాగుట్ట మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఇవాళ ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉద్యోగులు, పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చిన వారంతా ట్రాఫిక్ జాంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సాధారణరోజుల కంటే ఇవాళ ట్రాఫిక్ జాం ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
దసరా సెలవులు పూర్తై నిన్నటి నుండి విద్యా సంస్థలు పున:ప్రారంభం అయ్యాయి. దీంతో సెలవులకు స్వంతగ్రామాలకు వెళ్లినవారంతా 90 శాతానికి పైగా నిన్నటికే హైద్రాబాద్ కు చేరుకున్నారు. ట్రాఫిక్ జాం అయి వాహనదారులు ఇబ్బందులు పడకుండా పోలీసులు ఇటీవలనే ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోప్ ను అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.