
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో నేటి నుంచి మూడు రోజుల పాటు.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే గత రాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
మంగళవారం నుంచి బుధవారం వరకు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలెర్ట్ చేసిందిఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇక, బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని దాదాపు 20 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అయితే జూలై 17 నుంచి జూలై 25 మధ్య తెలంగాణలో భారీ వర్షపాతం హెచ్చరిక కారణంగా గోదావరిలో భారీ ఇన్‌ఫ్లో అంచనా వేయబడింది.