హైద్రాబాద్‌లో ప్రారంభమైన భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జాం

By narsimha lode  |  First Published Jul 31, 2023, 4:55 PM IST

హైద్రాబాద్ నగరంలో  సోమవారంనాడు సాయంత్రం భారీ వర్షం ప్రారంభమైంది.  దీంతో  పలు చోట్ల  వాహనాలు నిలిచిపోయాయి.


హైదరాబాద్: నగరంలో సోమవారంనాడు  సాయంత్రం మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది. గత  సోమవారం నుండి  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  గత సోమవారంనాడు హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది.  

 

Dt: 31-07-2023 at 1745 hrs.

Due to water login atGRT jewellers traffic movement of vehicles is slow from Vengal Rao park,NFCL, Panjagutta X road, Camp Office towards Begumpet flyover. Traffic police available and regulating traffic.Commuters are requested to take alternate route pic.twitter.com/8DL1oKVrbW

— Hyderabad Traffic Police (@HYDTP)

Heavy rains in Habsiguda ⛈️⛈️ pic.twitter.com/Gn3t0qa2e8

— Telangana state Weatherman (@ts_weather)

Latest Videos

 ఇవాళ  సాయంత్రం  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ,  లింగంపల్లి, ఆశోక్ నగర్, మియాపూర్,  బాలానగర్, నేరేడ్ మెట్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీ నగర్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాల్లో  భారీ వర్షం కురుస్తుంది.   ఇవాళ సాయంత్రం  హైద్రాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని  వాతావరణ  శాఖ వార్నింగ్  ఇచ్చింది. 

 

UPDATE🚨
04:00PM

Dense clouds💨 from moving SE,
Hence Moderate-Heavy Rainfall ⛈️ possible at Northern & Central parts of the city in next 2 hours. pic.twitter.com/gRFEWhIZYV

— HYDERABAD Weatherman (@HYDmeterologist)

విధులు ముగించుకొని  ఇళ్లకు  వెళ్లే సమయంలో  వర్షం ప్రారంభం కావడంతో  ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా  రోడ్లపై  నీరు  చేరి ట్రాఫిక్ జాం  నెలకొంది.నగరంలోని ఐకియా నుండి జేఎన్టీయూ వరకు  ట్రాఫిక్ జాం అయింది.

హైద్రాబాద్ సహా  శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే  అవకాశం ఉందని  వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ  శాఖ హెచ్చరించినట్టుగానే  నగరంతో పాటు  శివారు ప్రాంతాల్లో  భారీ వర్షం  కురుస్తుంది.రాష్ట్రంలోని పలు జిల్లాలకు  కూడ  ఎల్లో అలెర్ట్ ను  జారీ చేసింది  వాతావరణ శాఖ.

click me!