హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం...(వీడియో)

By AN TeluguFirst Published Oct 9, 2021, 9:47 AM IST
Highlights

ఇక పాతబస్తీలోని నాలా పరివాహిక ప్రాంతాలైన భవానీ నగర్, డబీర్ పురా,యకుత్ పురా లోని రోడ్లన్నీ జలమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి.. రోడ్ల మీద వరదలా నీరు చేరడంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. 

హైదరాబాద్ : శుక్రవారం రాత్రి హైదరాబాద్ ను జడివాన వణికించింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

"

ఇక పాతబస్తీలోని నాలా పరివాహిక ప్రాంతాలైన భవానీ నగర్, డబీర్ పురా,యకుత్ పురా లోని రోడ్లన్నీ జలమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి.. రోడ్ల మీద వరదలా నీరు చేరడంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. పాతబస్తీలోని ఓ హోటలో లోకి మడమ పైదాకా వరద నీరు చేరడంతో నీటిలోనే కూర్చుని టీలు తాగుతూ కనిపించారు. 

నగరంలో గతరాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్-బెంగళూరు రహదారిమీద వరదనీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా హైదరాబాద్-బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

రహదారికి ఇరువైపులా 3 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరాంఘర్-శంషాబాద్ రహదారిమీద కూడా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జాతీయ రహదారులే కాదు గల్లీల్లో కూడా వర్షానికి నీరు భారీగా చేరుతుండడంతో జనాలు బైటికి రావడానికి భయపడ్డారు. ఇళ్లలో నుంచి కాలు బయట పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 
 

click me!