తెలంగాణలో భారీ వర్షాలు: ఇంటి పైకప్పుకూలి ముగ్గురు మృతి

By telugu teamFirst Published Oct 14, 2020, 11:41 AM IST
Highlights

తెలంగాణలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. నాగర్ కర్నూలులో ఓ ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మరణించారు. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. బెంగుళూర్, హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలకు ఇంటి పైకప్పు కూలి వారు మరణించారు. 

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకొండిలో బడికుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి చెరువుకు గండి పడడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పెనుబల్లి, రాతోని చెరువు అలుగు దాటుతుండగా ప్రవాహ ఉధృతికి రవి, అతని కుమారుడు జగదీష్ కొట్టుకుపోయారు. 

Gallery: వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్ (ఫోటోలు)

భువనగిరి రూరల్ మండలం నాగిరెడ్డి పల్లి వద్ద వరద ఉధృతికి ముగ్గురు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా తల్లాడలో 20 గొర్రెలు మరణించాయి. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై మోకాలు లోతు నీళ్లు నిలిచాయి.

రంగారెడ్డి జిల్ాల శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద అప్పచెరువు తెగింది. భారీ వరద రావడంతో ముగ్గురు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు హైదరాబాదు, బెంగళూరు జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల వాహనాలు వరదలో కొట్టుకుపోాయయి. 

Also Read: భారీ వర్షాల ఎఫెక్ట్: తెలంగాణలో రెండు రోజుల పాటు సెలవులు

సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం వల్ల రాయికోడ్ మండలం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రహరీ గోడ కూలింది. రాయికోడ్ మండలంోలని ధర్మాపూర్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి.

సంగారెడ్డి జిల్ాలలోని పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీ గాలులతో పడిన వర్షం వల్ల కటౌట్ కూలిపోియంది. గత నెలలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు.  

click me!