హైద్రాబాద్ సరూర్‌నగర్‌లో వర్షం తెచ్చిన విషాదం: గుండెపోటుతో మహిళ మృతి

Published : Sep 03, 2021, 11:42 AM IST
హైద్రాబాద్ సరూర్‌నగర్‌లో వర్షం తెచ్చిన విషాదం:  గుండెపోటుతో మహిళ మృతి

సారాంశం

హైద్రాబాద్ సరూర్‌నగర్  కోదండరామనగర్ లో వరద నీటిలో అంబులెన్స్ చిక్కుకోవడంతో ఓ మహిళ మరణించింది. గుండెపోటు రావడంతో అంబులెన్స్ పిలిచినా ఆ కుటుంబానికి ఫలితం దక్కలేదు.వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది.

హైదరాబాద్: హైద్రాబాద్ సరూర్‌నగర్ కోదండనగర్‌లో వరద నీటిలో అంబులెన్స్ చిక్కుకుపోవడంతో ఓ మహిళ  మృతి చెందింది.గురువారం నాడు సాయంత్రం  హైద్రాబాద్ నగరంలో  భారీ వర్షం కురిసింది.ఈ వర్షంతో సరూర్ నగర్ చెరువు నుండి  కోదండరామునగర్‌లో వరద నీరు ముంచెత్తింది.

మళ్లీ వరదతో తమ ఇంటిని ముంచెత్తుతోందనే ఆవేదన కారణంగా ఓ మహిళకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వరద నీటిలో చిక్కుకుపోయింది. బాధితురాలి ఇంటి వద్దకు అంబులెన్స్ చేరలేదు.

అయితే స్ట్రెచర్ పై బాధితురాలిని  అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చారు  ఈ లోపుగానే  బాధితురాలు మరణించింది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.హైద్రాబాద్ నగరంలో వర్షం కురిస్తే సరూర్ నగర్  చెరువు కింద ఉన్న కోదండరామనగర్‌, వివేకానంద నగర్ తదితర  కాలనీలను వర్షపు నీరు ముంచెత్తుతుంది. వర్షం వస్తే ఈ  కాలనీ వాసులు భయంతో గడుపుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu