హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

Published : Aug 01, 2022, 11:54 AM IST
హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

సారాంశం

హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, హబ్సిగూడ, మల్కాజ్‌గిరి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డీకపూల్‌, కోఠి, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, చింతల్, షాపూర్‌నగర్, గాజుల రామారం, సూరారం.. ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో నగరంలో పలుచోట్ల ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గాల్లో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్టలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, రాగల రెండు, మూడు గంటల్లో నగరంలో చాలా ప్రాంతల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలో రామచంద్రపురంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 34.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి జూలై 31 వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో సాధారణ వర్షపాతం 284.9 మిల్లీమీటర్లకు గానూ.. 485.1 మిల్లీమీటర్లు నమోదైంది.

మరోవైపు తెలంగాణ మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉందని.. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్‌ ప్రాంతం వరకూ విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?