
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గోషామహల్, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, ఉప్పల్, అంబర్‌పేట, కాచిగూడ, సైదాబాద్, తార్నాక, గోల్నాక, నల్లకుంట, రాంనగర్, హబ్సిగూడ, నారాయణగూడ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, తిరుమలగిరి, రామ్‌గోపాల్‌పేట్, రాంనగర్, విద్యానగర్, దోమలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లలో భారీ వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. అయితే ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి.. భారీ వర్షం కురియడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.