తెలంగాణను వీడని వాన.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Published : Jul 23, 2022, 09:37 AM ISTUpdated : Jul 23, 2022, 09:51 AM IST
తెలంగాణను వీడని వాన.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

సారాంశం

తెలంగాణను వాన ముప్పు వీడటం లేదు. మరోమారు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణను వాన ముప్పు వీడటం లేదు. మరోమారు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. నగరంలోని పలు చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో చాలా చోట్ల రోడ్లపై వదర నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో జనం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మహబూబాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా దంతాపల్లిలో అత్యధికంగా 21 సెం.మీ వర్షపాతం నమోదైంది.  

ఇక, మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు అరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 

సూర్యాపేట జిల్లాలో వాగులో చిక్కుకున్న కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తెచ్చారు.  మద్దిరాల మండలం ముకుందపురం-జీ.కొత్తపల్లి మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో దాదాపు 23 మంది పంటపొలాల్లో చిక్కుపోయారు. దీంతో వారిని సిబ్బంది క్షేమంగా బటయకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏడుపాయల వనదుర్గ ఆలయంలోకి చేరిన వరద నీరు చేరింది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. 

భారీ వర్షాల కారణంగా వరంగల్‌లోని మండి బజార్ లో పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు  రెస్క్యూ టీం తో అక్కడికి చేరుకున్నారు.  భవన శిధిలాల నుంచి  వారిని వెలికితీసి..వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. వర్షాలవల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని నగర ప్రజలకు సూచించారు. 

హైదరాబాద్ జంట జలశయాలకు భారీ వరద..
భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలశయాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. ఉస్మాన్‌సాగర్‌కు 2000 క్యూసెక్కులుగా ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి..  832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు హిమాయత్‌ సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొసాగుతుంది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?