బీసీసీఐ జోక్యం చేసుకునే పరిస్ధితి, అజార్ పద్ధతి బాలేదు: హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేష నారాయణ

By Siva KodatiFirst Published Jun 20, 2021, 2:32 PM IST
Highlights

హెచ్‌సీఏలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇప్పటికే అజారుద్దీన్‌పై అపెక్స్ కమిటీ వేటు వేయగా.. దీనిని అజార్ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. అధ్యక్షునిగా కొనసాగేందుకే ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

హెచ్‌సీఏలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇప్పటికే అజారుద్దీన్‌పై అపెక్స్ కమిటీ వేటు వేయగా.. దీనిని అజార్ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. అధ్యక్షునిగా కొనసాగేందుకే ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణలోని కొత్త జిల్లాల నుంచి ఆరుగురికి హెచ్‌సీఏ సభ్యులుగా అవకాశం కల్పించారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 

అసోసియేషన్ పరువుని అజారుద్దీన్ బజారు కీడుస్తున్నారని హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేషనారాయణ ఆరోపించారు. ఆదివారం క్రికెట్ ఆడటం వేరని, అడ్మినిస్ట్రేషన్ వేరని అజారుద్దీన్ తెలుసుకోవాలంటూ చురకలంటించారు. అపెక్స్ కౌన్సిల్ తొలగించినా ప్రెసిడెంట్‌గా కొనసాగటం హాస్యాస్పదమని తప్పుబట్టారు. జిల్లాల అధ్యక్షులను నియమించటంలో నిబంధనలు పాటించలేదని శేషనారాయణ విమర్శించారు.

Also Read:హెచ్‌సీఏలోకి కొత్త సభ్యులు.. ఏ అధికారంతో చేశారు, పిచ్చిపట్టిందా: అజార్‌‌పై అపెక్స్‌ కౌన్సిల్ ఆగ్రహం

అజారుద్దీన్ హయాంలో 18 నెలల్లో బీసీసీఐ నుంచి 47 కోట్లు వచ్చాయని, రూ.47 కోట్లు ఎక్కడ ఏమయ్యయో అజార్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హెచ్‌సీఏలో పరిణామాలపై బిసీసీఐ కలుగజేసుకునే పరిస్థితులు వచ్చాయని శేషనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ సభ్యులను బీసీసీఐ డిసాల్వ్ చేస్తేనే హైదరాబాద్ క్రికెట్ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడాననంటూ అజహారుద్దీన్ అందరినీ హేళన చేస్తున్నాడని శేషనారాయణ ఆరోపించారు. 

click me!