సిద్దిపేటలో కొత్త కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

Published : Jun 20, 2021, 12:40 PM IST
సిద్దిపేటలో కొత్త కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్  ఆదివారం నాడు  సిద్దిపేటలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు


సిద్దిపేట: తెలంగాణ సీఎం కేసీఆర్  ఆదివారం నాడు  సిద్దిపేటలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ఆదివారం నాడు ఉదయం సీఎం కేసీఆర్ సిద్దిపేటకు చేరుకొన్నారు. సిద్దిపేటలో రూ. 63 కోట్ల 60 లక్షలతో నూతన  కలెక్టరేట్   భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కూడ సీఎం ప్రారంభించారు. కలెక్టరేట్ లోని రూమ్ లను సీఎం కు మంత్రిి హరీష్ రావు చూపారు. 

 ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన వనతిపత్రాలను కేసీఆర్ తానే అందుకొన్నారు.   సిద్దిపేట నుండి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.ఇవాళ్టి నుండి కేసీఆర్  జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న వరంగల్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ నెల 22న  యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. భువనగిరి జిల్లాలో ని వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather