తల్లిని చంపిన కీర్తి: చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక నిఘా

By narsimha lode  |  First Published Nov 3, 2019, 8:09 AM IST

తల్లిని చంపిన కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న కీర్తిరెడ్డిపై జైలు అధికారులు ప్రత్యేక నిఘాను ఉంచారు. తోటి ఖైదీలు అడిగిన ప్రశ్నలకు కీర్తి రెడ్డి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం.



హైదరాబాద్: తల్లిని చంపిన కేసులో కీర్తిరెడ్డి చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీల మాదిరిగాను ఉందని జైలు అధికారులు చెప్పారు. అయితే కీర్తిరెడ్డిని జైలు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. తల్లిని చంపిన కేసులో కీర్తిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు.

గత నెల 19వ తేదీన తల్లి రజితను రెండో ప్రియుడు శశికుమార్ తో కలిసి కీర్తిరెడ్డి హత్య  చేసింది.ఈ కేసులో కీర్తిరెడ్డితో పాటు ఆమె ఇద్దరు ప్రియుళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Latest Videos

చంచల్‌గూడ జైల్లో ఉన్న కీర్తిని ఇతర ఖైదీలు జైలుకు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. తల్లిని ఎందుకు చంపావని అడిగారరు. పెద్ద పెద్ద నేరాలు చేసిన ఖైదీలతో కీర్తి ప్రవర్తన ఎలా ఉందనే విషయమై కూడ జైలు అధికారులు ఆరా తీస్తున్నారు. 

జైలులో ఉన్న ఖైదీలతో పాటు, జైలు అధికారులు ఏం  అడిగినా కూడ బెరుకు లేకుండా కీర్తి రెడ్డి సమాధానం చెప్పినట్టుగా సమాచారం.తల్లిని ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చిందనే విషయమై కూడ ఇతర ఖైదీలు అడిగితే కీర్తి సమాధానం చెప్పినట్టుగా జైలు వర్గాలు తెలిపాయి.

అయితే కీర్తి మానసిక పరిస్థితిని, ప్రవర్తనను తెలుసుకొనేందుకు  జైలు అధికారులు ఆమెను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్టుగా సమాచారం. తోటి ఖైదీలను అధికారులు అప్రమత్తం చేశారు. 

కీర్తికి జైలు అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ అందిస్తున్నారు. కీర్తి మానసిక పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించే అవకాశం ఉందని సమాచారం.

రూ. 10 లక్షల కోసం తన తల్లి రజితను గత నెల 19వ తేదీన రెండో ప్రియుడు శశికుమార్ తో కలిసి కీర్తిరెడ్డి హత్య చేసింది. కీర్తిరెడ్డి తల్లి రజితను హత్య చేస్తేనే తనకు కీర్తిరెడ్డితో పాటు ఆమె ఆస్తి దక్కుతోందని శశికుమార్ ప్లాన్ చేశాడు.ఈ ప్లాన్ లో భాగంగానే బాల్ రెడ్డితో పాటు తనతో కీర్తిరెడ్డి సన్నిహితంగా ఉన్న పోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని శశికుమార్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ బెదిరింపులతోనే రెండుసార్లు రజితను హత్య చేయాలని కీర్తిరెడ్డి ప్లాన్ చేసింది. మొదటిసారి తల్లికి నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. కానీ, రెండోసారి మాత్రం కీర్తిరెడ్డి ప్లాన్ సక్సెస్ అయింది. తల్లి కళ్లలో కారం కొట్టి ఆమెను ఛాతీపై కూర్చొంది. రెండో ప్రియుడు శశికుమార్ ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు.
 

ఈ వార్తలు కూడా చదవండి

గతంలోనూ తల్లిని చంపేందుకు ప్లాన్, బలవంతంగా కీర్తిని వశపరుచుకున్న శశి

తల్లి రజితను చంపిన కీర్తి: దృశ్యం సినిమాకు రెండో వెర్షన్

ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి

click me!