ఇప్పుడు హర్యానా కూడా..

Published : Nov 27, 2016, 01:57 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఇప్పుడు హర్యానా కూడా..

సారాంశం

సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధమైన హర్యానా తెలంగాణ సమగ్ర సర్వేపై అక్కడి అధికారుల అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే దేశంలోనే ఒక సంచలనం. దీనికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా వచ్చింది. ఇప్పడు ఇలాంటి సర్వేనే చేయడానికి హర్యానా రాష్ట్రం సిద్ధమైంది.

 

ఇందులో భాగంగా రేపు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ అధికార బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. హర్యానా చీఫ్ సెక్రటరీ డీఎస్ దేశీ నేతృత్వంలోని 9 మంది అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. సమగ్ర కుటుంబ సర్వేపై అధ్యయనం చేయనుంది.

 

టూరిజం ప్లాజాలో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్యతో హర్యానా బృందం భేటీ కానుంది. 2014 ఆగస్టు 19న రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గురించిన వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. హర్యానా బృందానికి రాజీవ్ శర్మ వివరిస్తారు.

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu