వడ్లు కొనమంటున్న బిజెపి మనకొద్దు...డిల్లీ గద్దెపై నుండి దించేద్దాం..: హరీష్ రావు

By Arun Kumar P  |  First Published Dec 22, 2021, 6:40 PM IST

కేంద్ర మంత్రి పియుష్ గోయల్, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. 


గద్వాల: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల (telangana farmers) మీద పగ పట్టిందని... అందుకే ధాన్యం కొనకుండా ఇబ్బంది పెడుతోందని ఆర్ధిక, వైద్య శాఖల మంత్రి హరీష్ రావు (harish rao) ఆరోపించారు. 1969 నుండి కేంద్రమే వడ్లు కొంటుంతోందని... ఈసారి కూడా ఎప్పటిలాగానే కొనాలని అంటే కొనేది లేదని అంటున్నారని మండిపడ్డారు. వడ్లు కొనము అంటున్న బీజీపీ(BJP) మనకు వద్దు... ఆ పార్టీని కేంద్రంలో గద్దె దించితెనే వడ్లు కొనే పరిస్థితి వస్తుందని మంత్రి హరీష్ పేర్కొన్నారు.

బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా (jogulamba gadwal district)లో మంత్రి హరీష్ పర్యటించారు. గద్వాల్ లో 300 పడకల జిల్లా ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి, మల్దకల్ మండలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేసారు. అలాగే కేసీఆర్ అన్నదాతల ఆత్మీయ సంబరాల సభా ప్రాంగణాన్ని ప్రారంభించారు. 

Latest Videos

undefined

ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలందరి తరపున మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjan reddy) నేతృత్వంలో మంత్రుల బృందం డిల్లీ వెళ్లి మంత్రి పీయూష్ గోయల్ (piyush goyal) ని వడ్లు కొనాలని అడిగితే అవమానం చేస్తారా...మీకేం పని లేదా అంటారా...? అని ప్రశ్నించారు. రైతుల ఓట్లు కావాలి కానీ వారి నుండి వడ్లు మాత్రం కొనం అంటున్నారని హరీష్ మండిపడ్డారు. 

read more  వరి ధాన్యం ఇష్యూ: తెలంగాణ మంత్రులపై పీయూష్ వ్యాఖ్యలు... క్షమాపణకు హరీష్ రావు

''వడ్లు కొనము అంటున్న బీజీపీ మనకు వద్దు.. బిజేపిని కేంద్రంలో గద్దె దించితెనే వడ్లు కొనే పరిస్థితి వస్తుంది. 70 లక్షల మంది తెలంగాణ రైతాంగానికి అవమానం జరిగింది. రైతులు గుణపాఠం చెప్పాలి. మూగ జీవాలకు రైతుల మీద ఉన్న ప్రేమ... మనుషులైన బిజెపి నేతలకు లేదు'' అని మండిపడ్డారు. 

''తెలంగాణ రైతాంగానికి అవమానం, నష్టం జరుగుతుంటే ఇక్కడి బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపిలు మౌనంగా ఉంటారా.. కేంద్రాన్ని నిలదీయరా....?ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి వారికి అవమానం జరుగుతుంటే.. సోయి లేకుండా ఉన్నారు... అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలి'' అని సూచించారు. 

read more  తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. ముందస్తు ఎన్నికలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

''రైతుల ఉసురు ఉసురు బీజెపీకి తగులుతుంది. మొన్ననే మూడు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ దెబ్బకు మళ్లీ దిమ్మ తిరిగి దిగిరావాల్పిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, నీళ్ళు... ఇలా అన్ని ఇచ్చారు. రైతులకు మీరేం ఇచ్చారు?'' అని నిలదీసారు. 

''ధాన్యం అన్ని ప్రభుత్వాలు కొన్నాయి.  మీరు మాత్రం కొనమంటున్నారు. తెలంగాణ అంటే ఆత్మ గౌరవం.. దానికి దెబ్బ తగిలితే ఊరుకోం. అవమానాలు చేస్తే సహించం.. రైతులందరూ ఒక్కతాటిపై వచ్చి గుణపాఠం చెబుదాం'' అని హరీష్ హెచ్చరించారు. 

పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నట్టుగానే తమ రాష్ట్రంలో కూడా వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని కేంద్రం ఎందుకు తమ చేతుల్లోనే ఉంచుకొందో చెప్పాలన్నారు. వరి ధాన్యం కొనుగోలును రాష్ట్రాలకు అప్పగించాలని మంత్రి డిమాండ్ చేశారు.దేశమంతా వరి ధాన్యం కొనుగోలుపై  ఒకే విధానం ఉండాలని ఆయన  డిమాండ్ చేశారు.   
 

click me!