సంగారెడ్డి ప్రమాదంపై హరీష్ ఏమన్నారంటే....

By Arun Kumar PFirst Published Sep 29, 2018, 2:28 PM IST
Highlights

సంగారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన జిల్లా మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మంత్రికి స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా టపాసులు కాలుస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులకు మంటలు అంటుకుని చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే మంత్రికి అతి సమీపంలో ఈ ప్రమాదం జరిటగినప్పటి మంత్రి సురక్షితంగా ఇక్కడినుండి బైటపడ్డారు.
 
ఈ ఘటనపై మంత్రి హరీష్ తన ట్విట్టర్ లో స్పందించారు. సంగారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన చిన్న ప్రమాదంలో తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. తాను క్షేమంగానే వున్నానని... టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన క్షేమం గురించి పరితపిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంగారెడ్డి ఎన్నికల ప్రచారం ర్యాలీలో నాకు ఎటువంటి ప్రమాధం జరుగలేదు. నేను క్షేమంగానే ఉన్నా .. మిత్రులెవరూ ఆందోళన చెందవద్దు..
మీ అభిమానానికి ధన్యవాదాలు

— Harish Rao Thanneeru (@trsharish)

సంబంధిత వార్తలు

హరీష్ రావుకి తృటిలో తప్పిన ప్రమాదం

click me!