పుట్టా మధు అక్రమాస్తులపై ఐటి,సిబిఐకి ఫిర్యాదు చేసిన ఎనుముల

By Arun Kumar PFirst Published Sep 29, 2018, 1:24 PM IST
Highlights

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల మధ్య ప్రచార యుద్దమే కాకుండా వ్యక్తిగ యుద్దం జరుగుతోంది.  సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జైలుకు వెళ్లడం నుండి రేవంత్ రెడ్డి పై ఐటీ సోదాలు జరిగేవరకు పరిస్థితులను గమనిస్తే పార్టీల మధ్య యుద్దవాతావరణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే వ్యక్తిగత కక్షతోనే తమపై కేసులు, దాడులు జరుగుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆరోపణలే కాదు ఏకంగా ఐటీ, సిబిఐ అధికారులకు ఫిర్యాదులు అందడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.

టీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మంథని మాజీ ఉపసర్పంచ్ ఎనుముల సత్యనారాయణ. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాదాపు రూ. 900 కోట్లు అక్రమంగా సంపాదించాడంటూ ఐటీ, సిబిఐ కి ఎనుముల ఫిర్యాదు చేశాడు. మంథనితో పాటు హైదరాబాద్ లో కూడా పుట్టాకు లెక్కకు మించిన అక్రమాస్తులు ఉన్నాయంటూ సత్యనారాయణ ఆరోపించారు.

పుట్టా మధు తన తల్లి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వందల కోట్ల వసూళ్లకు పాల్పడినట్లు ఆయన ఆరోపించాడు. మధుతో పాటు ఆయన భార్య, కుటుంబ సభ్యుల పేరుతో అనేక అక్రమాస్తులు ఉన్నట్లు ఎనుముల తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పిర్యాదు దారుడు సత్యనారాయణ ఐటీ, సిబిఐ అధికారులను కోరారు.

ఇటీవలే లాయర్ రామారావు ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. అయితే తాజాగా అధికార పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై అలాంటి ఫిర్యాదులే అందడంతో అధికారులు ఎలా వ్యవహరిస్తారనే దానిపై రాజకీయంగానే కాకుండా ప్రజల్లో చర్చ జరుగుతోంది. 

click me!