ఈ పొగడ్త చాలదూ..

Published : Jan 24, 2017, 03:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఈ పొగడ్త చాలదూ..

సారాంశం

ఐటీ మంత్రి కేటీఆర్ పై హరీశ్ రావు పొగడ్తల వర్షం

 

సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ను మంత్రి హారీశ్ రావు ప్రశంసలతో ముంచెత్తారు. హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమలను తీసుకరావడంలో కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. అయితే హారీశ్ వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు నేతలు తలో రకంగా అర్థం చేసుకుంటున్నారు.

 

ఈ రోజు గచ్చిబౌలిలోని సేల్స్‌ఫోర్స్ కంపెనీని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... హైదరాబాద్‌కు  ఐటీ కంపెనీలు క్యూ కట్టడానికి మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషే కారణమనికొనియాడారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి కేటీఆర్ పనితీరే నిదర్శనమనన్నారు. కాగా, హరీశ్ రావు ప్రశంసలపై ట్విటర్లో కేటీఆర్ కూడా స్పందించారు.

 

ఇలా కేటీఆర్ ను హరీశ్ ప్రశంసించడం నిజంగా వారిద్దరి మధ్య ఉన్న సఖ్యతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

 

అధికార టీఆర్ఎస్ పార్టీలో హరీశ్, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, ఎప్పటికైనా పార్టీలో విబేధాలు బయటకొస్తాయని భావిస్తున్నవారికి ఈ ‘పొగడ్త’లు కొన్ని రోజులైనా ఫుల్స స్టాప్ పెడుతాయని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.

 

అయితే మరికొందరు మాత్రం సీఎం కేసీఆర్ కుమారుడిగా మంచి స్వింగ్ లో ఉన్న కేటీఆర్ తో ఢీ కొట్టడం వృథా ప్రయాస అని భావించే హరీశ్ ఇలా రాజీకొస్తున్నారని,  ఏదో ఒక రోజు పార్టీలో విబేధాలు బయటకొస్తాయని చెబుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu