వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగి శ్రీనివాస్ ను ఎలుకలు కొరికిన ఘటనపై విచారణకు ఆదేశించినట్టుగా మంత్రిహరీష్ రావు చెప్పారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
వరంగల్: MGM ఆసుపత్రిలో ని ICUలో Srinivas అనే రోగి కాలు, చేతిని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది.ఈ విషయమై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి Harish Rao విచారణకు ఆదేశిస్తున్నట్టుగా గురువారం నాడు ప్రకటించారు.
ఈ ఘటనపై విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకొంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావొద్దని మంత్రి హరీష్ రావు వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు.
Warangal ఎంజీఎం ఆసుపత్రిలో కిడ్నీలు పాడైన స్థితిలో చికిత్స కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. శ్రీనివాస్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం స్పృహలో లేడు. అయితే ఐసీయూలో ఉన్న శ్రీనివాస్ కాళ్లు, చేయిని ఎలుకలు కొరికాయి.ఈ విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి.
దీంతో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీవాస్తవ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి రోగి బంధువులతో చర్చించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఆసుపత్రిలో విధుల్లో అందరూ ఉన్నారా , ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే విషయమై కూవా శ్రీవాస్తవ ఆరా తీశారు. ఐసీయూలోకి ఎలుకలు ఎలా వచ్చాయనే విషయమై కూడా అడిషనల్ కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండ్ ను ప్రశ్నించారు.
శానిటేషన్ సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వ్యాప్తి చెందుతున్నాయని కూడా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గతంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒక్క రోజు పసికందును కుక్కలు కరిచి చంపాయి. ఈ ఘటన 2011 జనవరి 12న చోటు చేసుకొంది. 2018లో మృత శిశువును ఎలుకలు కొరికిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.