అమేజింగ్ రిజల్ట్.. ఎన్నికల్లో గెలుపుపై కవిత కామెంట్

prashanth musti   | Asianet News
Published : Jan 25, 2020, 02:36 PM ISTUpdated : Jan 25, 2020, 02:41 PM IST
అమేజింగ్ రిజల్ట్.. ఎన్నికల్లో గెలుపుపై కవిత కామెంట్

సారాంశం

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 100కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి.  అయితే ఈ విజయంతో అప్పుడే రాష్ట్రంలో గులాబీ సంబరాలు మొదలయ్యాయి.  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నేతలు వారి ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. 

మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు కనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 100కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి.  అయితే ఈ విజయంతో అప్పుడే రాష్ట్రంలో గులాబీ సంబరాలు మొదలయ్యాయి.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నేతలు వారి ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. కవిత స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు బిగ్ థ్యాంక్యూ. పోటీలో గెలిచినా ప్రతి ఒక్క అభ్యర్థికి నా శుభాకాంక్షలు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేసిన టీఆరెస్ పార్టీ సపోర్టర్స్ కి కూడా తన బెస్ట్ విషెస్ అందిస్తున్నట్లు తెలియజేశారు.

మంత్రి హరీష్ రావు వివరణ ఇస్తూ.. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు. అలాగే ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్