తెలంగాణ మున్సిపల్ ఫలితాలు: బోణీ కొట్టిన టీడీపీ

By telugu teamFirst Published Jan 25, 2020, 1:36 PM IST
Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మథిర మున్సిపాలిటీలో టీడీపీ ఓ వార్డును గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉండడమే ఆ విజయానికి కారణమని భావిస్తున్నారు.

ఖమ్మం: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఖాతా తెరిచింది. ఖమ్మం జిల్లాలోని మథిర మున్సిపాలిటీలో ఓ వార్డును గెలుచుకుంది. ఈ వార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉండడమే టీడీపీ విజయానికి కారణమని భావిస్తున్నారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. సత్తుపల్లి మున్సిపాలిటీని టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. వైరా మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 7 వార్డులను గెలుచుకుంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆధిక్యతలో కొనసాగుతోంది. 

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 

click me!