హరీష్ రావు మాకు టచ్ లో ఉన్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య

Published : May 09, 2019, 07:36 AM IST
హరీష్ రావు మాకు టచ్ లో ఉన్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య

సారాంశం

బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం జంపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో కోమటిరెడ్డి హరీష్ రావుపై వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని జోస్యం చెప్పారు.

భువనగిరి: తెలంగాణ మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావు విషయంలో కాంగ్రెసు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  హరీశ్‌రావు తమతో టచ్‌లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌ పార్టీకి త్వరలో గండికొట్టడం ఖాయమని ఆయన అన్నారు. 

బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం జంపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో కోమటిరెడ్డి హరీష్ రావుపై వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని జోస్యం చెప్పారు. 

భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుస్తారని, జడ్పీ చైర్మన్‌ పదవి కూడా కాంగ్రెస్‌దే అన్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు హరీష్ రావును పక్కన పెట్టారనే ప్రచారం సాగుతోంది.

హరీష్ రావు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు స్పందిస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?