బావిలో దూకిన చెల్లి, కాపాడేందుకు ప్రయత్నించి అన్నయ్యలు మృతి

Published : May 08, 2019, 08:12 PM IST
బావిలో దూకిన చెల్లి, కాపాడేందుకు ప్రయత్నించి అన్నయ్యలు మృతి

సారాంశం

చెల్లి బావిలో దూకడం గమనించిన సోదరులు రమేశ్(19), సంజీవ్(23)లు చెల్లిని రక్షించుకునేందుకు ప్రయత్నించారు. చెల్లిని కాపాడే ప్రయత్నంలో వారిద్దరూ కూడా బావిలో మునిగిపోయారు. బావిలో బురద ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ముగ్గురూ అదే బావిలో మృత్యువాత పడ్డారు.   

జోగులాంబ గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన చెల్లిని రక్షించుకునేందుకు వెంటనే అన్నదమ్ములిద్దరూ ప్రయత్నించి వారు మృత్యు ఒడికి చేరారు. 

చెల్లిని కాపాడబోయి ఆమెతో బాటు అన్నయ్యలు ఇద్దరూ విగతజీవులుగా మారిన ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం  కిష్టంపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే  కుటుంబ కలహాలతో పదహారేళ్ల జ్యోతి అనే అమ్మాయి బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 

చెల్లి బావిలో దూకడం గమనించిన సోదరులు రమేశ్(19), సంజీవ్(23)లు చెల్లిని రక్షించుకునేందుకు ప్రయత్నించారు. చెల్లిని కాపాడే ప్రయత్నంలో వారిద్దరూ కూడా బావిలో మునిగిపోయారు. బావిలో బురద ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ముగ్గురూ అదే బావిలో మృత్యువాత పడ్డారు. 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అందరి కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చెల్లిని రక్షించబోయి రమేష్, సంజీవ్ లు చనిపోయారా లేక ముగ్గురు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు