Harish Rao: సీఎం కేసీఆర్ వలనే సిద్దిపేటకు రైల్వే లైన్ వచ్చిందనీ, ఆయన లేకపోతే .. రైల్వే లైన్ వచ్చేదే కాదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసిందనీ,ఈనాడు బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతూ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలాగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
Harish Rao: సిద్దిపేట జిల్లాకు రైలు రావడం గొప్ప వరమని, ఈ కలను నిజం చేసింది సీఎం కేసీఆరే అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటకు నీళ్లు, నిధులు, రైలు రావాలన్నది సీఎం కేసీఆర్ కల అని హరీష్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడల్లా సిద్దిపేటకి రైలు తెస్తామని, రైలు ఇస్తామని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
2006న రైల్వే లైన్ మంజూరు కాగా.. 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని కేంద్రం చెప్పిందని అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆరే సిద్దిపేట రైల్వే లైన్ ని స్వయంగా రూపకల్పన చేశారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారారు కానీ.. సిద్దిపేటకు రైల్వే లైన్ రాలేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నారని, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు చెల్లించింది కేసీఆరే అని అన్నారు. గత ప్రభుత్వాలు సిద్దిపేట,మెదక్,కరీంనగర్ పైకక్ష కట్టాయని తెలిపారు. నేడు బీజేపీ వాళ్ళు రైలు తమ వల్లే వచ్చిందని చెబుతున్నారు ఇది సిగ్గుచేటు అని అన్నారు. 33 శాతం వాటా కడితే కనీసం సీఎం ఫోటో కూడా పెట్టలేదని, 2508 ఎకరాల భూ సేకరణ చేసి.. రూ. 310 కోట్లు చెల్లించింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి హరీష్ రావు అన్నారు.
అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 330 కోట్లు ఇచ్చామని అన్నారు. ఇంత చేసినా.. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం తాము కష్టపడి.. తాము డబ్బులు ఇచ్చామని, ఈ విజయం తెలంగాణ ప్రజలదేనని మంత్రి పేర్కొన్నారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసిందనీ,ఈనాడు బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు.సీఎం కేసీఆర్ లేకపోతే సిద్దిపేటకు రైల్వే లైన్ లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.