
అంబర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో దాదాపు మూడు గంటలకు పైగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఇద్దరు అధికారులను ఏసీబీ విచారిస్తోంది. రూ.1.50 లక్షలు లంచం తిసుకుంటూ సర్వేయర్ లలిత , రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ శోభలు రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు. ఒక భూమికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విషయంలో వీరిద్దరూ పది లక్షలు డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
ALso Read: మర్రిగూడ ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం..
కాగా.. శనివారం ఏసీబీ అధికారులు మర్రిగూడ తహసిల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. రెండు కోట్ల నగదు లభించింది. దీంతోపాటు.. ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు, బంగారం గుర్తించారు. మహేందర్ రెడ్డికి చెందిన 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మహేందర్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏసీబీ దాడులకు దిగింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా మర్రిగూడ తహసిల్దారుగా ఆయన పనిచేస్తున్నారు.