భార్యాభర్తల మధ్య ‘ఆమ్లెట్’ చిచ్చు..

Published : Nov 15, 2018, 10:42 AM IST
భార్యాభర్తల మధ్య ‘ఆమ్లెట్’ చిచ్చు..

సారాంశం

భార్యభర్తల మధ్య ఆమ్లెట్ చిచ్చు పెట్టింది. తాను అడిగితే భార్య ఆమ్లెట్ వేసి పెట్టలేదని ఓ భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

భార్యభర్తల మధ్య ఆమ్లెట్ చిచ్చు పెట్టింది. తాను అడిగితే భార్య ఆమ్లెట్ వేసి పెట్టలేదని ఓ భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెం.1లోని ఎంఐజీకి చెందిన రేవడ మహేష్(24), వనజ దంపతులు. రమేష్ అక్కడికి సమీపంలోని ఓ భవనానికి వాచ్ మెన్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. మంగళవారం రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వెళ్లిన రమేష్.. ఆమ్లెట్ వేయాల్సిందిగా భార్యను కోరాడు.

 అయితే... అందుకు భార్య నిరాకరించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తపై అలిగిన భార్య వెంటనే పక్కింట్లోకి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన మహేష్.. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత వనజ.. ఇంటికి వచ్చి చూడగా.. మహేష్ ఉరివేసుకొని కనిపించాడు.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే