నందమూరి కుటుంబానికి ఈ రహదారి శాపం: యాక్సిడెంట్ జోన్లు ఇవే

By narsimha lodeFirst Published Aug 30, 2018, 12:22 PM IST
Highlights

నల్గొండ జిల్లాలో  జాతీయ, రాష్ట్ర రహదారులపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. జాతీయ రహదారిని  నాలుగు రోడ్లుగా  చేసినా ప్రమాదాలు చేసినా కూడ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. రాష్ట్ర రహదారులపై కూడ ప్రమాదాలు కూడ  తగ్గలేదు.


నల్గొండ: నల్గొండ జిల్లాలో  జాతీయ, రాష్ట్ర రహదారులపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. జాతీయ రహదారిని  నాలుగు రోడ్లుగా  చేసినా ప్రమాదాలు చేసినా కూడ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. రాష్ట్ర రహదారులపై కూడ ప్రమాదాలు కూడ  తగ్గలేదు.

 నల్గొండ జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలోనే నందమూరి  హరికృష్ణతో పాటు ఆయన తనయుడు  జానకీరామ్ నాలుగేళ్ల వ్యవధిలో మరణించారు. యూటీఎప్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఆయన సతీమణి కట్టంగూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ సతీమణి చనిపోగా, ఆయన  ప్రాణాలతో బతికిబయడ్డాడు.

నెలలో వందల సంఖ్యలో ఈ జిల్లాలో  రోడ్డు ప్రమాదానికి గురై మరణిస్తున్నారు. తీవ్రంగా గాయాలబారిన పడినవారు కూడ లేకపోలేదు.

నల్గొండ జిల్లా గుండా 65 నెంబర్ జాతీయ రహాదారి వెళ్తోంది. ఈ జాతీయ రహాదారిని నాలుగు రోడ్ల లైన్లుగా మార్చాలని  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి.  టీడీపీ, సీపీఎం, సీపీఐలు  కలిసి పెద్ద ఎత్తున ఆందోళన సాగించాయి. కోదాడ నుండి హైద్రాబాద్ వరకు పాదయాత్ర కూడ చేశారు.

ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి టీడీపీలో ఉన్న కాలంలో  పాదయాత్ర నిర్వహించారు.   అయితే ప్రస్తుతం   జాతీయ రహదారిని నాలుగు రోడ్లుగా వెడల్పు చేశారు. మరో వైపు  నాలుగు రోడ్లుగా మార్చినా కూడ ఈ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ తగ్గడం లేదు.  ఆరు రోడ్లుగా మార్చాల్సిన అవసరం కూడ ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే  మరోవైపు  జాతీయ రహదారిని వెడల్పు చేసినా... సర్వీస్ రోడ్ల నుండి జాతీయ రహదారి వైపుకు వాహనాలు వెళ్లే  సమయంలో జాతీయ రహదారి నుండి  సర్వీస్ రోడ్లపైకి  వాహనాలు వెళ్లే సమయంలో  కూడ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.

నల్గొండ జిల్లాను  సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలుగా విభజించారు.2016 నుండి 2018 వరకు  సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో  627  రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారాలతో పాటు ఇతర రహదారులపై ఈ ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఇందులో 259 మంది మరణించారు. 706 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

2017లో  జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారులపై 614 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.ఈ ప్రమాదాల్లో 239 మంది మృతి చెందితే 793 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2018లో 386 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ ప్రమాదాల్లో 137 మంది మృతి చెందారు. 450 మంది గాయపడ్డారు.

ఇక నల్గొండ జిల్లాలో (భువనగిరి జిల్లాను కూడ కలుపుకొని) 2016 నుండి 2018 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి వివరాలిలా ఉన్నాయి.2016లో మొత్తం 989 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.ఇందులో 310 మంది మృత్యువాతపడ్డారు. 1075 మంది తీవ్రంగా గాయపడ్డారు.

2017లో 961 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 393 మంది ప్రాణాలు కోల్పోతే, 1186 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక 2018లో 554 రోడ్డుప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.211 మంది మృత్యువాతపడ్డారు. 653 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ హైవేలపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను పోలీసు శాఖ గుర్తించింది. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్ద 5 నెంబర్ కిలోమీటర్ రాయి వద్ద ప్రమాదం జరుగుతాయని గుర్తించారు.హరికృష్ణ కారు కూడ ఈ ప్రాంతానికి అతీ సమీపంలోనే ప్రమాదానికి గురైంది.నల్గొండ రూరల్ మండలంలోని చర్లపల్లి, తిప్పర్తి మండలంలోని  దుప్పలపల్లి వద్ద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.దామరచర్ల, రాళ్లవాగు వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

నల్గొండ జిల్లాలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై మునగాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. ఇదే జిల్లాలోని నార్కట్ పల్లి వద్ద 2014 ఎన్నికలకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత లాల్ జాన్ భాషా మృతి చెందాడు. బుధవారం నాడు నార్కట్ పల్లి మండలం అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందాడు.

 

ఈ వార్తలు చదవండి

హరికృష్ణ మృతి: వస్తానంటే ఆ డ్రైవర్‌ను వద్దన్నాడు

హరికృష్ణ మృతి: అతను డ్రైవర్‌గా చేరి ఉంటే

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

click me!