హరికృష్ణను కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

Published : Aug 30, 2018, 11:54 AM ISTUpdated : Sep 09, 2018, 12:45 PM IST
హరికృష్ణను కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

సారాంశం

రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. తమ అభిమాన నటుడు, రాజకీయ నాయకుడిని కడసారిగా చూసి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

తమ అభిమాన నేత, నటుడు హరికృష్ణను కడసారి చూసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులకు కుటుంబ సభ్యులు అవకాశం కల్పించారు. నిన్నంతా వీఐపీలు వస్తూ, పోతూ ఉండటంతో సాధారణ కార్యకర్తలకు, ఫ్యాన్స్ కు హరికృష్ణ బౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించే అవకాశం దక్కలేదు.

 ఈ ఉదయం 8 గంటల నుంచి మెహిదీపట్నంలోని ఆయన ఇంటివద్ద బారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి, ఓ క్రమ పద్ధతిలో అభిమానులను హరికృష్ణ ఇంటిలోనికి అనుమతిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. తమ అభిమాన నటుడు, రాజకీయ నాయకుడిని కడసారిగా చూసి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.  కాగా, ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు
ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు