హరికృష్ణ మృతి: రాత్రి ఒకటిన్నరకు నిద్ర లేపాలని అడిగారు

Published : Aug 30, 2018, 04:05 PM ISTUpdated : Sep 09, 2018, 01:44 PM IST
హరికృష్ణ మృతి: రాత్రి ఒకటిన్నరకు నిద్ర లేపాలని అడిగారు

సారాంశం

 నెల్లూరు జిల్లా కావలిలో జరిగే శుభకార్యానికి వెళ్లేందుకు రాత్రి ఒంటి గంటకు నిద్ర లేపాలని  ఆహ్వానం హోటల్  రిసెప్షనిస్టు  అజయ్‌కుమార్ కు  హరికృష్ణ సూచించారు.  


హైదరాబాద్: నెల్లూరు జిల్లా కావలిలో జరిగే శుభకార్యానికి వెళ్లేందుకు రాత్రి ఒంటి గంటకు నిద్ర లేపాలని  ఆహ్వానం హోటల్  రిసెప్షనిస్టు  అజయ్‌కుమార్ కు  హరికృష్ణ సూచించారు.  ఈ సూచన మేరకు హరికృష్ణను రాత్రి పూట ఒంటి గంటకు ఆయన నిద్రలేపాడు.

బుధవారం నాడు ఆగష్టు 29వ తేదీన కావలిలో జరిగే పెళ్లికి హజరయ్యేందుకు  ముందు రోజు నుండే  హరికృష్ణ ప్లాన్ చేసుకొన్నాడు. మంగళవారం నాడు రాత్రి ఆహ్వానం హోటల్ నుండి ఇంటికి వెళ్లే ముందు  రాత్రి ఒంటిగంటకు తనను నిద్ర లేపాలని  హరికృష్ణ ఆహ్వానం హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేసే అజయ్‌ను కోరారు.  హరికృష్ణ సూచన మేరకు   అజయ్  అదే సమయానికి హరికృష్ణను నిద్రలేపాడు. 

అజయ్ నిద్ర లేపగానే కావలికి వెళ్లేందుకు   హరికృష్ణ తయారయ్యాడు.ఉదయం పూట   నాలుగు గంటల సమయంలో  తన ఇంటి నుండి  కారులో  బయలు దేరాడు.  తన స్నేహితులు వెంకటరావు, శివాజీ  ఇళ్ల వద్దకు వెళ్లి   వారిని పికప్ చేసుకొన్నాడు. 

నేరుగా కావలికి బయలుదేరాడు.  నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మీదుగా  హరికృష్ణ  వాహనం  కావలికి వెళ్తోంది. ఈ  వాహానం అన్నెపర్తి వద్దకు చేరుకోగానే రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందాడు.

ఈ వార్తలు చదవండి

హరికృష్ణ వెంట ఎప్పుడూ ఆ ఇద్దరే...
నందమూరి కుటుంబానికి ఈ రహదారి శాపం: యాక్సిడెంట్ జోన్లు ఇవే

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం