డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ‌కుడు.. క‌లచివేస్తున్న వీడియో దృశ్యాలు

Published : Feb 26, 2023, 02:56 PM IST
డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ‌కుడు.. క‌లచివేస్తున్న వీడియో దృశ్యాలు

సారాంశం

Nirmal: అంద‌రూ సంతోషంలో మునిగివున్న స‌మ‌యంలో రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్ర‌స్తుతం అంద‌రి హృద‌యాల‌ను క‌ల‌చివేస్తున్నాయి.  

 young man collapsed due to heart attack while dancing: ఇటీవ‌లి కాలంలో అప్ప‌టివ‌ర‌కు బాగానే ఉండి.. క్ష‌ణాల్లో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు క్ర‌మంగా పెరుగుత‌న్నాయి. ఇదే కోవ‌లో అంద‌రూ సంతోషంలో మునిగివున్న స‌మ‌యంలో రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్ర‌స్తుతం అంద‌రి హృద‌యాల‌ను క‌ల‌చివేస్తున్నాయి. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని నిర్మ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ యూజ‌ర్ ట్విట్ట‌ర్ లో ఈ ఘ‌ట‌న వీడియోను పంచుకున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కుభీర్ మండలంలోని పార్డి(కే) గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం 19 ఏళ్ల ముత్యం మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందినవాడు. పార్డి (కె) గ్రామంలో జరిగిన రిసెప్షన్ పార్టీలో తెలుగు సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ రాత్రి 7 గంటల ప్రాంతంలో ముత్యం ఒక్క‌సారిగా కుప్పకూలిపోయాడు.

వెంటనే భైంసాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం భైంసా మండలం కమోల్ గ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చాడ‌ని బంధువులు తెలిపారు. ఓ యూజ‌ర్ ట్విట్ట‌ర్ లో ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు డాన్సు చేస్తున్న దృశ్యాల‌ను పంచుకుంటూ.. "అప్పటివరకు బాగానే ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా కుప్పకూలిపోతున్నారు.. అప్పటి వరకు ఉల్లాసంగా డాన్స్ చేశారు.. ఉత్సాహంగా గంతులు వేశారు . పాటకు అందరూ చప్పట్లు కొట్టారు. నిర్మల్ లో యువకుడు ముత్యం మృతి కలిచి వేసిందని" పేర్కొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే