ప్రజల్లో చెరగని ముద్ర... హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

Published : Aug 29, 2018, 09:44 AM ISTUpdated : Sep 09, 2018, 01:07 PM IST
ప్రజల్లో చెరగని ముద్ర... హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

సారాంశం

ఎన్టీఆర్ కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేసనప్పటికీ హరికృష్ణ రాజకీయ నాయకుడిగానే ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలకభూమిక పోషించారు. చైతన్యరథానికి సారథిగా వ్యవహరించి లక్ష కిలోమీటర్ల మేర దానిని నడిపారు

ఎన్టీఆర్ కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేసనప్పటికీ హరికృష్ణ రాజకీయ నాయకుడిగానే ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలకభూమిక పోషించారు. చైతన్యరథానికి సారథిగా వ్యవహరించి లక్ష కిలోమీటర్ల మేర దానిని నడిపారు.

1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన హరికృష్ణ... 1996లో రవాణా శాఖా మంత్రిగా పనిచేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విభేదించి ‘‘అన్న తెలుగుదేశం’’ పార్టీని స్థాపించి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే 2008లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అయ్యారు. 2014లో రాష్ట్రవిభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడంపై పార్టీ అధిష్టానంతో విభేదించిన హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

ఎంపీగా తన స్వగ్రామం నిమ్మకూరులో పలు అభివృద్ధి పనులు చేశారు. రూ.1.35 కోట్లతో రోడ్ల నిర్మాణం చేయడంతో పాటు గ్రామంలో కోటి రూపాయలతో సోలార్ సిస్టమ్, ఏపీఆర్జేసీ స్కూల్‌ని 50  లక్షలతో అభివృద్ది చేశారు. రవాణా శాఖ మంత్రిగా ట్రాక్టర్ ట్రాలీపై ఫిట్‌‌నెస్‌ టెస్ట్‌ని రద్దు చేసి.. రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు హరికృష్ణ.

హరికృష్ణ మృతి: కారు ప్రమాదం ఎలా జరిగింది?

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

ప్రజల్లో చెరగని ముద్ర... హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్