సిద్దిపేటలో క్రైస్తవ భవన్ నిర్మాణం...హామీ ఇచ్చిన హరీష్ రావు

By Arun Kumar PFirst Published Dec 22, 2018, 3:06 PM IST
Highlights

సిద్దిపేటలోని భూదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే  హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... క్రిస్టియన్ల అభివృద్దికి పలు హామీలిచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో దాదాపు రూ.25 లక్షలు వెచ్చించి క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. 

సిద్దిపేటలోని భూదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే  హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... క్రిస్టియన్ల అభివృద్దికి పలు హామీలిచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో దాదాపు రూ.25 లక్షలు వెచ్చించి క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. సకల సదుపాయాలతో నిర్మించే ఈ భవనం కోసం మరిన్ని నిధులు కావాల్సినా మంజూరు చేయిస్తానని తెలిపారు. అంతేకాకుండా పేద క్రిస్టియన్లకు డబుల్ బెడ్ రూం ఇళ్ళను కూడా కేటాయించనున్నట్లు హరీష్ హామీ ఇచ్చారు. 

పవిత్రమైన మాసంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి క్రిస్టియన్ పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభువు ఆశీర్వాదం, దీవెన వల్లే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయ్యిందని హరీష్ అన్నారు.

 

ఎంతో కష్టపడి సిద్దిపేట నియోజకవర్గంలోని అందరు ప్రజలు కలిసి భారీ మెజారిటీని అందించారని హరీష్ గుర్తుచేశారు.టీఆర్ఎస్ గెలుపుకు కూడా అన్ని వర్గాలు సహకరించారని అన్నారు. అన్ని కులాలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని హరీష్ స్పష్టం చేశారు.అధికారికంగా క్రిస్టమస్  సంబరాలు చేస్తున్న తొలి ప్రభుత్వం తమదేనని హరీష్ అన్నారు. అంతా సంతోషంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

రూ. 1.30 కోట్లతో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో చర్చిల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో క్రిస్టియన్లను భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు మైనార్టీ  రెసిడెన్షియల్ పాఠశాలలు  ఏర్పాటు చేసి ఈ వర్గాల్లో విద్యాభివృద్దికి పాలుపడుతున్నట్లు హరీష్ స్పష్టం చేశారు. 
 

click me!