
నగదు కొరత మళ్లీ తెలంగాణాలో విజృంభించింది. ఎక్కడ చూసిన ఏటీఎంలు ‘నో క్యాష్ ’ బోర్డు తగలించుకుని దిష్టి బొమ్మల్లా తయారయ్యాయి.
ఎప్పటినుంచో అచ్చు గుద్దుతున్నా నోట్లయితే మన వూర్లకు రావడం లేదు. ఇవన్నీఎక్కడికి పోతున్నాయో అర్థం కావడంలేదు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచాక ఇక నోట్ల కష్టాల గురించి పట్టించుకోనవసరం లేదనే భావం కేంద్రానికి కలిగాందా అనే అనుమానం వచ్చేలా పరిస్థితి మారింది. ఎన్నికష్టాలు పడినో ఓటు మనకే అని కేంద్రంలోని పార్టీ భావిస్తున్నదా!
కొన్నిచోట్ల సహనం నశించి ఏటీఎంలపై దాడికి దిగుతున్నరు.
నోట్ల కరువు ఇలా తాండవిస్తూంటే, నగదు ఉపసంహరణపై ఆంక్షలు తొలగించినట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడం నవ్వులాట గ లేదూ.
తెలంగాణాలో 8,458 ఏటీఎంలున్నాయి. ఇందులో 4 వేల ఏటీఎంలు నో క్యాష్ బోర్డులుతగిలించుకున్నాయి. కొన్ని ఎంటిఎం లు ఎపుడూ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉంటాయి. మిగతా ఏటీఎంలలోకి ఎపుడు నగదొస్తుందో, ఎపుడు మూతపడ్తాయో తెలియక ప్రజలు నానా ఆగచాట్లుపడుతున్నారు.
డబ్బు బ్యాంకుళ్లో పడితే అంతే సంగతులు, ప్రాణం పోయినా మళ్లీ దొరకదనే భయం అందరిలో నాటుకుపోయింది.దీనితో డబ్బంతా ఇంట్లో దాచుకుంటున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు.