హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులు, ఓఎస్‌డీ సస్పెన్షన్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

By narsimha lode  |  First Published Aug 13, 2023, 10:35 AM IST

హకీంపేట  స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ హరికృష్ణను వెంటనే సస్పెండ్  చేసినట్టుగా తెలంగాణ క్రీడల శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.


హైదరాబాద్: నగరంలోని హకీంపేట స్పోర్ట్స్  స్కూల్ అధికారి  హరికృష్ణను సస్పెండ్  చేసినట్టుగా తెలంగాణ క్రీడల శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల అంశానికి సంబంధించి  ఆదివారంనాడు అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశం  ముగిసిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్  మీడియాతో మాట్లాడారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్  లో  బాలికలపై  లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు  ఎదుర్కొంటున్న  హరికృష్ణను వెంటనే సస్పెండ్  చేశామన్నారు.

రెండు, మూడు రోజుల్లో విచారణను పూర్తి చేయాలని అధికారులను  ఆదేశించినట్టుగా మంత్రి తెలిపారు.  విచారణలో బాధ్యులని తేలిన వారిని కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.మీడియాలో వచ్చిన కథనాలను  చూసిన వెంటనే  అధికారులతో సమీక్ష నిర్వహించి  ఓఎస్‌డీ హరికృష్ణను సస్పెండ్  చేసినట్టుగా మంత్రి తెలిపారు. ఈ ఘటన వెనుక  ఎవరున్నారనే విషయాలను  సమగ్రంగా  విచారణ చేస్తామన్నారు.  బాధ్యులు ఎవరైనా సరే  ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం  చేశారు.మహిళల పట్ల ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా  సహించబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బాలికలపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డ అధికారికి సహకరించిన  వారిని కూడ వదిలిపెట్టబోమని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు  కూడ లొంగబోమన్నారు.

Latest Videos

ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నుండి  యాక్షన్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్‌డీ హరికృష్ణ తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కావని నిరూపించుకోవాలన్నారు.  బాలికలు తనను తండ్రి మాదిరిగా  చూస్తారని  హరికృష్ణ చెబుతున్నాడని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.  ఈ విషయాలన్నీ విచారణలో బయటకు వస్తాయని మంత్రి తెలిపారు.చిన్న విషయం బయటకు రాగానే  ప్రభుత్వం వెంటనే  స్పందిస్తుందనే  మేసేజ్ ఇవ్వడానికి  ఓఎస్‌డీపై  సస్పెన్షన్ వేటేసినట్టుగా  మంత్రి వివరించారు.చాలా శాఖల్లో  డిప్యూటేషన్ పై  పనిచేసే వారున్నారన్నారు.  ఉద్యోగ విరమణ చేసిన  వారిని కూడ  డిప్యూటేషన్ పై  పనిచేసే వారే ఉన్నారన్నారు.

also read:హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులు:అధికారి సస్పెన్షన్

బ్రిజ్ భూషణ్ పై  చర్యలు తీసుకోవాలని  రోజుల తరబడి ఆందోళన చేసినా కేంద్రం చర్యలు తీసుకోలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బ్రిజ్ భూషణ్ పై  చర్యలు తీసుకోవాలని తాను కూడ ఆందోళనలో పాల్గొన్నట్టుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్  గుర్తు  చేశారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో  ఆరోపణలపై  గంటల వ్యవధిలో  చర్యలు తీసుకొన్నట్టుగా   మంత్రి తెలిపారు.


 

click me!