కవిత హెల్మెట్ ప్రోగ్రాం కెటిఆర్ కు నచ్చలేదా?

Published : Aug 07, 2017, 05:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
కవిత హెల్మెట్ ప్రోగ్రాం కెటిఆర్ కు నచ్చలేదా?

సారాంశం

హెల్మెట్ వాడితే ఉన్న జుట్టు పోతదా అని కెటిఆర్ ప్రశ్న కవిత కానుకగా ఇచ్చిన హెల్మెట్ ను తిరిగి ఆమెకే ఇచ్చిన కెటిఆర్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమం దేశాన్ని ఆకర్షించింది. రాఖీ ఉత్సవం సందర్భంగా రాఖీ కట్టడంతోపాటు సోదరులకు హెల్మెట్ కూడా కొనివ్వాలన్నది కవిత కార్యక్రమం కాన్పెప్ట్. ఆమె చొరవను చాలా మంది అభినందించారు. క్రికెటర్ సెహ్వాగ్, గౌతం గంభీర్ లు సైతం కవిత చేపట్టిన సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి అభినందనలు కురిపించారు.

అయితే ఆమె చేపట్టిన ఈ కార్యక్రమం కెటిఆర్ కు నచ్చలేకుండొచ్చా అన్న ప్రచారం తాజాగా టిఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది. ఇవాళ ఉదయం రాఖీ సందర్భంగా కవిత రాఖీ కట్టడంతోపాటు హెల్మెట్ కూడా కెటిఆర్ కు అందజేసింది. అది తీసుకుంటున్న సందర్భంలో కెటిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హెల్మెట్ పెట్టుకుంటే ఉన్న జుట్టు ఊడిపోతుందా అని ఆయన కవితను ఉద్దేశించి అన్నారు. దీంతో ఆమె నవ్వి సైలెంట్ అయ్యారు.

అలాగే కవిత బహుమతిగా ఇచ్చిన హెల్మెట్ ను తలకు పెట్టుకోవాలా అంటూ ఎదురుగా ఉన్న వారిని అడిగాడు కెటిఆర్. కొద్దిసేపు హెల్మెట్ ఎలా ఉందా అని అటు ఇటూ తిప్పిచూశాడు కెటిఆర్. తర్వాత దాన్ని కవితకే తిరిగి అందజేశారు.

మొత్తానికి హెల్మెట్ వాడితే జుట్టు ఊడిపోతుందన్న అపోహ జనాల్లో ఎప్పటినుంచో ఉంది. అదే మాట ఇయ్యాల కెటిఆర్ నోటి నుంచి కూడా రావడం చర్చనీయాంశమైంది. అసలు ఈ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం కెటిఆర్ కు నచ్చలేదా అన్న అనుమానాలు సైతం పార్టీ నేతల్లో నెలకొన్నాయి.

కెటిఆర్ సరదగా చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం పట్ల ఆయనకు ఏరకమైన వ్యతిరేక భావన లేదని టిఆర్ఎస్ నాయకుడొకరు ఏసియా నెట్ కు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం