దిశపై అనుచిత వ్యాఖ్యలు: గుంటూరు యువకుడు అరెస్ట్, హైదరాబాద్‌కు తరలింపు

By sivanagaprasad KodatiFirst Published Dec 4, 2019, 5:49 PM IST
Highlights

కామాంధుల చేతుల్లో బలైపోయిన దిశ ఘటనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన స్మైలీ నానిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు

గుంటూరుకు చెందిన స్మైలీ నానిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దిశ హత్య తర్వాత స్మైలీ గ్యాంగ్ సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టింది.

దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరుకు వెళ్లి నానిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇదే కేసులో ఇటీవలి ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:‘దిశ’ను బతికుండగానే కాల్చారు... జైల్లో ప్రధాన నిందితుడు

శంషాబాద్ వద్ద దిశపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరామ్‌ అనే యువకుడిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో  మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

శంషాబాద్ గ్యాంగ్‌ రేప్ ఘటన తర్వాత ఫేస్‌బుక్ లో గ్రూప్‌గా ఏర్పడి శ్రీరామ్ గ్యాంగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేప్ చేస్తే తప్పేంటి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.ఈ వ్యాఖ్యలపై  సీసీఎస్ పోలీసులు సుమోటోగా తీసుకొన్నారు. కేసు నమోదు చేశారు.

Also read:'దిశ'పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు: శ్రీరామ్ అరెస్ట్

టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకొని ఈ పోస్టులు ఎక్కడి నుండి వచ్చాయో పోలీసులు గుర్తించారు. దిశపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై రాజశేఖర్ అనే వ్యక్తి కూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు
 

click me!