హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏకే 47తో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Published : Jul 06, 2018, 06:37 PM IST
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏకే 47తో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

సారాంశం

హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. జూబ్లీహిల్స్‌లోని ప్రశానన్ నగర్‌లో రిటైర్డ్ డీజీ ఆర్పీ మీనా వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తోన్న కిశోర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు

హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. జూబ్లీహిల్స్‌లోని ప్రశానన్ నగర్‌లో రిటైర్డ్ డీజీ ఆర్పీ మీనా వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తోన్న కిశోర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తన వద్ద ఉన్న ఏకే 47 రైఫిల్‌తో శరీరంపై కాల్పులు జరుపుకున్నాడు.

కాల్పుల శబ్ధం విన్న తోటి సిబ్బంది వెంటనే అతన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, సంపన్నులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ ప్రముఖులు నివసించే ప్రశానన్ నగర్‌లో కాల్పులు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha : కేసీఆర్ కూతురు, అల్లుడు ఏం చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేసేవారో తెలుసా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు