గుజరాత్ పేపర్ హైదరాబాద్‌లో లీక్ .. తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల సోదాలు, 15 మంది అరెస్ట్

By Siva KodatiFirst Published Jan 29, 2023, 2:58 PM IST
Highlights

గుజరాత్ పంచాయతీరాజ్ శాఖకు చెందిన పేపర్ హైదరాబాద్‌లో లీక్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు.

గుజరాత్ పేపర్ హైదరాబాద్‌లో లీక్ కావడం కలకలం రేపుతోంది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన పరీక్షా పేపర్ రెండు గంటలకు ముందే ఇక్కడ లీక్ అయ్యింది. దీంతో పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో పరీక్ష పేపర్లు ప్రింటైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఒడిశాకు చెందిన నాయక్ ఈ పేపర్‌ను లీక్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏటీఎస్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. 

Also REad : గుజరాత్ పంచాయితీరాజ్ క్లర్క్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్: హైద్రాబాద్‌లో పోలీసుల దర్యాప్తు

ఈ పరీక్షకు సంబంధించిన  ప్రశ్నాపత్రాలు  హైద్రాబాద్ లో  ముద్రించారు. అయితే  ఈ పరీక్ష పేపర్లు ఒడిశాలో లీకైనట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇవాళ  పరీక్షను రద్దు చేయడంతో  అభ్యర్ధులు  ఆందోళనలు నిర్వహించారు. అయితే పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నామో త్వరలోనే  ప్రకటించనున్నట్టుగా  జీపీఎస్ఎస్‌ఈబీ ప్రకటించింది. 1150 జూనియర్ క్లర్క్  పోస్టుల కోసం  తొమ్మిది లక్షల మంది అభ్యర్ధులు  ధరఖాస్తు  చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో 12 ఏళ్లలో  ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా  రద్దు చేసిన  15వ పోటీ పరీక్షగా  కాంగ్రెస్ విమర్శించింది.  ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన నిందితులపై  చర్యలు తీసుకొంటే  ఈ తరహా ఘటనలు పునరావృతం కావని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషీ చెప్పారు.

గుజరాత్ పేపర్ లీక్‌ కేసులో హైదరాబాద్‌కు చెందిన జీత్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఒడిశాకు చెందిన ప్రదీప్ నాయక్‌కు పరీక్షా పేపర్‌ను అందజేశాడు. పంచాయతీ రాజ్ పరీక్ష ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు ఇతను పేపర్ లీక్ చేశాడు. పేపర్ లీక్ కావడంతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. 

click me!