హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో డ్రైవ్ చేసిన యువతులు..!

Published : Jan 29, 2023, 11:32 AM IST
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో డ్రైవ్ చేసిన యువతులు..!

సారాంశం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. 

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన అనంతరం కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ప్రమాద సమయంలో కారు అధిక వేగంతో దూసుకొస్తుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే మద్యం మత్తులో యువతులు కారును నడిపినట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తులో వారు కారులో షికార్లు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా సమాచారం. 

కారు ఫిల్మ్ నగర్ వైపు నుంచి చెక్ పోస్ట్ వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డుపై ప్రమాదానికి గురైన కారు రోడ్డుపై నిలిపోవడంతో టోయింగ్ వాహనంతో పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిదనే విషయం తెలియాల్సి ఉన్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?