గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో పరీక్షలు ఉన్నాయి. కానీ, టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
Telangana: మన రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడేలా ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. కీలక సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6వ, 7వ తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఇంకా అటూ ఇటుగా పది రోజుల గడువు ఉన్నది. కానీ, ఎలాంటి చర్యలు లేవు. దీంతో అభ్యర్థులు ఈ సారి కూడా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడతాయా? అనే టెన్షన్‌లో ఉన్నారు.
గ్రూప్ 2 పరీక్షలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇది వరకైతే గ్రూప్ 2 పరీక్షల కోసం టీస్‌పీఎస్సీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఒక వేళ పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేస్తారా? లేక మరికొన్ని పోస్టులను చేర్చి రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా? అనేది తెలియకుండా ఉన్నది. ఈ అంశాలపై టీఎస్‌పీఎస్సీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: KTR: బీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్.. పార్లమెంటు ఎన్నికల కోసం సిద్ధమవ్వండి: కేటీఆర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోటీ పరీక్షలపై రివ్యూ చేసింది. కానీ, గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ గురించి క్లారిటీ ఇవ్వలేదు.
గ్రూప్ 2 సంబంధ 783 పోస్టుల కోసం నోటిఫికేషన్ రాగా.. 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు పరీక్ష నిర్వహణపై టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు.