పెళ్లిలో మాంసం వడ్డించకుండా.. సాంబార్ మాత్రమే పోశారని గొడవ.. ఇధ్దరికి గాయాలు..

Published : Jun 05, 2023, 11:53 AM IST
పెళ్లిలో మాంసం వడ్డించకుండా.. సాంబార్ మాత్రమే పోశారని గొడవ.. ఇధ్దరికి గాయాలు..

సారాంశం

తనకు మటన్ వడ్డించకుండా సాంబార్ మాత్రమే పోశారంటూ వధువు తరఫు వ్యక్తి గొడవకు దిగడంతో ఇద్దరికి గాయాలైన ఘటన మెదక్ లో వెలుగు చూసింది. 

మెదక్ : పెళ్లిలో మర్యాదలు సరిగా లేవని గొడవలు జరగడం తెలిసిన విషయమే. అయితే, పెళ్లి విందులో ఓ వ్యక్తికి మటన్ వేయకుండా.. సాంబార్ మాత్రమే పోశారంటూ గొడవకు దిగడంతో  ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. కొట్టుకుంటున్న వారిని విడదీయడంతో గొడవ సద్దుమణిగింది. ఈ విచిత్రమైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండల పరిధిలోని చండీ గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఆలస్యంగా వెలుగు చూసింది. చండీ గ్రామానికి చెందిన అమ్మాయికి అదే మండలం నత్నయిపల్లికి చెందిన అబ్బాయితో  వివాహం నిశ్చయించారు. శనివారం నాడు ఈ వివాహం ఛండీ గ్రామంలో జరిగింది. పెళ్లి తర్వాత భోజనాలు పట్టిస్తున్నారు. వరుడి తరఫు బంధువులు భోజనం చేస్తున్నారు. 

డీహెచ్ శ్రీనివాసరావు తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

ఆ సమయంలో వారిలోని ఒకరికి.. మటన్ వడ్డించలేదట. ఆ తర్వాత వచ్చిన వారు సాంబార్ పోసి వెళ్లిపోయారు. దీంతో అతడు తీవ్ర కోపానికి వచ్చాడు. మటన్ వడ్డిస్తున్న వ్యక్తితో పాటు.. మరో వ్యక్తి మీద గొడవకు దిగి దాడి చేశాడు. దీనికి అబ్బాయి తరఫు వారు కూడా సహకరించాడు.  

పెళ్లిలో గలాట విషయం పోలీసుల దాకా వెళ్లడంతో వారు వచ్చి.. గొడవ పడుతున్న వారిని చదరగొట్టారు. ఇద్దరికీ గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. గొడవకు కారణమైన నలుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే గతంలో ఒడిశాలో జరిగింది. పెళ్లి విందులో మటన్ కర్రీ పెట్టలేదని గొడవ పెట్టుకోవడమే కాకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అంతేకాదు మరుసటి రోజే మరో అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది కూడా. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి వరుడితో పాటు తోడు పెళ్లి కొడుకు, ఇతర బంధువులు హాజరయ్యారు. 
అయితే.. ఈ పెళ్లిలో మటన్ కర్రీ కావాలని తోడు పెళ్లి కొడుకు అడిగాడు. అయితే ఆ విందులో మేకమాంసం లేదు. ఆ విషయం వధువు బంధువులు చెప్పగానే.. వరుడి తరఫు వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. 

చివరికి పెళ్లికొడుకు పెళ్లి రద్దుచేసుకునే దాకా వెళ్లింది. వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసి తన వారితో కలిసి బయటకు వచ్చేశాడు. అక్కడ్నుండి వరుడు, అతని బంధువులు అదే జిల్లలోని కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజే తమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని వరుడు పెళ్లి చేసుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్