వాలంటైన్స్ డే: భజరంగ్‌దళ్ కార్యకర్తల ఓవరాక్షన్, షాపు ధ్వంసం

Siva Kodati |  
Published : Feb 14, 2020, 07:16 PM IST
వాలంటైన్స్ డే: భజరంగ్‌దళ్ కార్యకర్తల ఓవరాక్షన్, షాపు ధ్వంసం

సారాంశం

వాలంటైన్స్ డేను నిరసిస్తూ భజరంగ్‌దళ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు హైదరాబాద్‌లో రచ్చ రచ్చ చేశారు

వాలంటైన్స్ డేను నిరసిస్తూ భజరంగ్‌దళ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు హైదరాబాద్‌లో రచ్చ రచ్చ చేశారు. శుక్రవారం ఉదయం ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ నగరంలో ర్యాలీగా వెళ్తున్న వారికి ఓ షాపులో వాలంటైన్స్ డే స్పెషల్ కేకులు, స్వీట్లు అంటూ బోర్డు కనిపించింది.

Also Read:ప్రేమికులకు భజరంగ్ దళ్ శుభవార్త: పెళ్లిళ్లు చేయరట, కానీ...

దీంతో మండిపడిన కార్యకర్తలు షాపులోకి ప్రవేశించి దానిని ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రతిరోజు ప్రేమికులతో కిటకిటలాడే హైదరాబాద్‌లోని పార్కులన్నీ శుక్రవారం వెలవెలబోయాయి.

యువకులు ఎవరైనా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు పార్కులకు వస్తే వారిని ఖచ్చితంగా అడ్డుకుంటామని భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ వంటి సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.

Also Read:వాలంటైన్స్ డే బలవంతపు పెళ్లి: ఆరుగురి అరెస్ట్

తమ హెచ్చరికలను కాదని ఎవరైనా పార్కుల్లో కనిపిస్తే వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పడంతో లవర్స్ అటువైపు కన్నెత్తి చూడలేదు. గతంలో ప్రేమికుల రోజున పార్కులకు వచ్చిన వారికి భజరంగ్‌దళ్ కార్యకర్తలు పెళ్లిళ్లు చేయడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!