మిస్ హైదరాబాద్ @ గౌరీప్రియ

Published : Oct 11, 2018, 10:36 AM IST
మిస్ హైదరాబాద్ @ గౌరీప్రియ

సారాంశం

అందం, అభినయం, ఆహార్యం, తెలివితేటలు కలబోతగా నిర్వహించిన పోటీలో కిరీటం కోసం 24 మంది అమ్మాయిలు పోటీపడ్డారు. విజేతగా గౌరీప్రియ ఎంపికవ్వగా.... ఫస్ట్‌ రన్నరప్‌గా అషిమా గౌతం, సెకండ్‌ రన్నరప్‌గా రియా సింగ్‌ ఎన్నికయ్యారు.

మిస్ హైదరాబాద్ 2018 కిరీటాన్ని గౌరీప్రియ గెలుచుకున్నారు. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో జరిగిన మిస్ హైదరాబాద్ 2018 పోటీలు ముగిశాయి. అందాల కిరీటం కోసం ముద్దుగుమ్మలు పోటీపడుతూ.. ర్యాంప్‌పై హొయలు పోయారు. అందం, అభినయం, ఆహార్యం, తెలివితేటలు కలబోతగా నిర్వహించిన పోటీలో కిరీటం కోసం 24 మంది అమ్మాయిలు పోటీపడ్డారు. విజేతగా గౌరీప్రియ ఎంపికవ్వగా.... ఫస్ట్‌ రన్నరప్‌గా అషిమా గౌతం, సెకండ్‌ రన్నరప్‌గా రియా సింగ్‌ ఎన్నికయ్యారు.

మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మిస్‌ హైదరాబాద్‌-2018 తుది పోటీలు బుధవారం రాత్రి నిర్వహించారు. 24 మంది అందగత్తెలు తమ అందచందాలతో అందాల కిరీటం కోసం నువ్వా.... నేనా అనే విధంగా చివరివరకు పోటీపడ్డారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో సాగిన అందాల పోటీల కోసం డిజైనర్లు రూపొందించిన వస్త్రాల్లో అందగత్తెలు మురిసిపోయారు.

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech