బార్‌లో ఖాకీల కుప్పిగంతులు.. తాగి యువకులను చితకబాదిన ఎస్సై

sivanagaprasad kodati |  
Published : Oct 11, 2018, 09:26 AM IST
బార్‌లో ఖాకీల కుప్పిగంతులు.. తాగి యువకులను చితకబాదిన ఎస్సై

సారాంశం

మద్యం మత్తులో పోలీసులు వీరంగం వేసి.. అడ్డొచ్చిన వారిని చితకబాదారు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తోన్న కుమారస్వామి, సెంట్రల్ జోన్‌లో పనిచేసే ఉపేందర్, నారపల్లిలో నివాసం ఉండే రైల్వే ఉద్యోగి యాదగిరి స్నేహితులు

మద్యం మత్తులో పోలీసులు వీరంగం వేసి.. అడ్డొచ్చిన వారిని చితకబాదారు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తోన్న కుమారస్వామి, సెంట్రల్ జోన్‌లో పనిచేసే ఉపేందర్, నారపల్లిలో నివాసం ఉండే రైల్వే ఉద్యోగి యాదగిరి స్నేహితులు..

ఈ నేపథ్యంలో ఎస్సై కుమారస్వామి మంగళవారం రాత్రి విధులు ముగించుకుని చెంగిచర్లలోని ఇంటికి వెళుతూ.. స్నేహితులతో కలిసి బోడుప్పల్‌ రోడ్డులోని ఓ బార్‌లో మద్యం తాగారు.. ఈ క్రమంలో మరో టేబుల్ వద్ద కూర్చున్న కొందరు యువకులు తాగి గొడవ పడుతున్నారు.

దీంతో ఎస్సై కుమారస్వామి ఎందుకు గొడవ చేస్తున్నారంటూ వారిని మందలించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. మిగిలిన వారు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ... బార్ మూసే వరకు పార్కింగ్ ప్రదేశంలో పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ క్రమంలో ఎస్సై కుమారస్వామి, మరో పోలీస్ ఉపేందర్‌ పోలీసు దెబ్బ ఎలా ఉంటుందో చూస్తావా అంటూ యువకుల మీదకు దూసుకెళ్లారు. గొడవ సద్దుమణిగిన తర్వాత ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

AI in Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో అధునాతన టెక్నాలజీ.. ఏఐతో మరింత కచ్చితత్వం
Ganesh Laddu Auction 2026: ఈసారి అత్యధిక ధర పలికిన టాప్ 10 లడ్డూ వేలాలు ఇవే