రూ.లక్ష డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.25వేలు వడ్డీ అనిచెప్పి

By ramya neerukondaFirst Published Dec 14, 2018, 5:05 PM IST
Highlights

 వచ్చే డబ్బులకు హామీ పత్రాలు ఇవ్వడంతో పాటు లక్షకు నెలకు ఆరు వేల రూపాయల వడ్డీని 25 నెలల పాటు ఇస్తానని, ఆ తరువాత లక్ష రూపాయలు కూడా తిరిగి ఇస్తానని నమ్మించాడు. ఈ స్కీంను నమ్మిన 14 వేల మంది 150 కోట్ల రూపాయలను అతనికి అప్పగించారు.

లక్ష రూపాయలు తన దగ్గర డిపాజిట్ చేస్తే.. వందకు ఆరు రూపాయిల వడ్డీ చొప్పున నెలకు రూ.25వేలు వడ్డీ ఇస్తానని.. కొద్ది నెలల తర్వాత అసలు కూడా ఇస్తానని నమ్మ బలికాడు. అమాయక ప్రజలను మాయమాటలతో మోసం చేసి రూ.150కోట్లు సంపాదించాడు. చివరకు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేటకు చెందిన మెతుకు రవీందర్.. రేవల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. అయితే.. వచ్చే జీతం ఎటూ సరిపోకపోవడంతో.. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కసి పెంచుకున్నాడు. ఇందుకోసం తన ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాడు. అనంతరం ప్రత్యేకంగా కంపెనీలు పెట్టాడు. వందల మందిని తనకు ఏజెంట్లుగా నియమించుకున్నాడు.

చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మంచి హోటల్స్ లో సమావేశం ఏర్పాటు చేసి.. ఏజెంట్ల ద్వారా ప్రజలను అక్కడికి వచ్చేలా చేసేవాడు. వారికి మాయ మాటలు చెప్పి.. ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపెట్టేవాడు. వచ్చే డబ్బులకు హామీ పత్రాలు ఇవ్వడంతో పాటు లక్షకు నెలకు ఆరు వేల రూపాయల వడ్డీని 25 నెలల పాటు ఇస్తానని, ఆ తరువాత లక్ష రూపాయలు కూడా తిరిగి ఇస్తానని నమ్మించాడు. ఈ స్కీంను నమ్మిన 14 వేల మంది 150 కోట్ల రూపాయలను అతనికి అప్పగించారు.

అయితే.. డబ్బు కట్టి నెలలు గడుస్తున్నా.. వడ్డీ రావడం లేదని..ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది. గతంలో కొందరు డబ్బులు ఇవ్వలేదని గొడవపెడితే.. వారికి కొంత ఎక్కువ సొమ్ముఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలిసింది. ఇలా ఇప్పటి వరకు కొన్ని వేల మందిని మోసం చేసి రూ.150కోట్లు సంపాదించాడు.  ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!