ముంబైలో ‘సామాన్యశాస్త్రం’ఫోటోగ్రఫి షొ...తెలుగువారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు

By Arun Kumar PFirst Published Dec 14, 2018, 4:54 PM IST
Highlights

ఇటీవల ముంబై నగరంలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ఫోటోగ్రాఫర్, జర్నలిస్టు కందుకూరి రమేష్ బాబు తన కెమెరా నుండి జాలువారిన ఫోటోలతో ఫోటోగ్రపీ షో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ముంబైలో తెలుగు వారు నివాసముండే ప్రాంతాలకు చాలా దూరం ఉంది. దీంతో ఫోటోగ్రఫి షోకి రావాలని భావించినవారు కూడా రాలేకపోయారు. దీన్ని గ్రహించిన రమేస్ బాబు ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఈ శని, ఆదివారాలు ( 15 -16 తేదీల్లో ) నవీ ముంబై లోని ‘తెలుగు కళా సమితి’లో ఆ చిత్రాలు ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. 

ఈ రెండు రోజులు ఉదయం పదకొండు నుంచి రాత్రి ఏడు గంటల వరకు సందర్శకులకు ఫోటోగ్రఫీ షోను వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. లాభాపేక్ష లేకుండా స్వల్ప ధరలోనే నచ్చిన ఫోటోలను వీక్షకులు కొనుగులు చేసుకోవచ్చని రమేష్ బాబు ఒక ప్రకటన చేశారు.  

తన ఫోటోగ్రఫి ప్రదర్శన గురించి రమేష్ బాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే చదువుదాం. మహా నగరంలో క్షణం తీరుబాటు లేని పరుగుల జీవితం... దానికి తోడు ఎటు వెళ్ళాలన్నా విపరీతమైన జనసమ్మర్ధం, గంటలకు గంటలు కాలం వృధా కావడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ప్రజలకు ఆటా పాటా,  కళా పోషణ విలాసం కిందే లెక్క. ఇందువల్లే చాలా మంది ఇటీవల నేను జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఛాయా చిత్ర ప్రదర్శన సందర్శించలేక పోయారని తెలిసింది. 

ముఖ్యంగా తెలుగు వారు నివాసం ఉండే నవీ ముంబై వాసులు అంత దూరం రావడం కష్టతరమైనదని విన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి, తెలుగు వారికి తన ఫోటోలను చూపకుండా వెళ్ళడం ఇష్టంలేకే మలి ప్రదర్శన ''తెలుగు కళా సమితి''లో ఏర్పాటు చేస్తున్నాను. అందువల్ల ప్రతి ఒక్క తెలుగు కుటుంబం ఈ ప్రదర్శనకు విచ్చేయాలని కోరుతున్నాను. తెలుగు వాకిట తన ప్రదర్శనను విజయవంతం చేస్తారని భావిస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నానంటూ రమేష్ బాబు మాట్లాడారు. 

click me!