మానవత్వం మాయమైంది

Published : Nov 17, 2016, 03:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
మానవత్వం మాయమైంది

సారాంశం

అనంతపురంలో సర్కారు ఆస్పత్రి నిర్వాకం రోగికి స్ట్రెచర్ ఇవ్వడానికి నిరాకరణ విధిలేని పరిస్థితిల్లో ర్యాంపై ఈడ్చికెళ్లిన భార్య

‘మనీ’తత్వం ముందు మానవత్వం మరోసారి ఓడిపోయంది. సర్కారు ఆస్పత్రి నిర్వాకంతో భర్త వెంట నడవాల్సిన భార్య ఆ భర్తనే ఈడ్చుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన పి. శ్రీనివాసఆచారి హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు.

అనారోగ్యం వల్ల కొంత కాలం క్రితం తిరిగి ఇంటికి వచ్చేశాడు. మూడు రోజులుగా కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్న ఆచారిని బుధవారం ఉదయం ఆయన భార్య శ్రీవాణి పెద్దాస్పత్రికి తీసుకొచ్చింది.

 

కాలికి గాయం, ఆపై నీరసంగా ఉన్న తన భర్తను ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ ఇవ్వాలని సిబ్బందిని, సెక్యూరిటీ గార్డులను ప్రాధేయపడింది.

ఆస్పత్రిలో స్ట్రెచర్లు అందుబాటులో ఉన్నా పైసా ఇవ్వకుండా స్ట్రెచర్ ఇచ్చేదే లేదని సిబ్బంది ఖరాకండిగా చెప్పేశారు.

 

 

దీంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్తను మొదటి అంతస్తులోని వైద్యుని వద్దకు తీసుకెళ్లేందుకు విధిలేక ర్యాంపు పైనే ఈడ్డుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

ఇదంతా చూస్తున్నా.. ఆస్పత్రి సిబ్బంది, అక్కడికి వచ్చిన రోగులు, వారి బంధువులు కూడా ఆమెకు సహాయం చేయకుండా మానవత్వాన్ని మంటగలిపారు.

 

 

ఈ సంఘటనపై ఆస్పత్రి ఏవో డాక్టర్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి ఆలస్యంగా వచ్చిందనన్నారు. ఆస్పత్రిలో ఐదు స్ట్రెచర్లు ఉన్నాయని తెలిపారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఇలా మొద‌లైందో లేదో, అలా సెల‌వులు.. సమ్మర్ హాలీడేస్ పొడ‌గిస్తూ ప్ర‌భుత్వ నిర్ణ‌యం. రీఓపెన్ ఎప్పుడంటే.?
CM Revanth Reddy Speech: జడ్చర్ల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu