సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజలకు సేవ: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ తమిళిసై

By narsimha lode  |  First Published Jun 2, 2022, 11:34 AM IST

రాష్ట్రానికి సేవ చేస్తూ తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నట్టుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. ఇవాళ రాజ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె ప్రసంగించారు.



హైదరాబాద్:  రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan చెప్పారు.

Telangana Formation దినోత్సవ వేడుకలను Raj Bhavan లో నిర్వహించారు.ఈ వేడుకల్లో ఆమె ప్రసంగించారు. ముందుగా కేక్ కట్ చేసి తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా  తెలంగాణ ప్రజలకు తాను సేవ చేస్తానని కూడా Governor తమిళిసై ప్రకటించారు. తాను రాష్ట్రానికి గవర్నర్ నే కాదు, మీ అందరికి సోదరిని అంటూ గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

తాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎలాంటి బాధపడడం లేదన్నారు. తాను తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు.

తెలంగాణ గవర్నర్ గా తాను రాష్ట్రంలో చేసిన కార్యక్రమాలను ఆమె వివరించారు.  ఆదీవాసీలతో సహపంక్తి భోజనాలతో పాటు  వారి జీవనస్థితిగతులను పరిశీలించినట్టుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

Nampally పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తమిళిసై సౌందర రాజన్ దూరంగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ సీఎం KCR సహా ఆయన మంత్రివర్గ సహాచరులు ఎవరూడా హాజరు కాలేదు. 

తెలంగాణ గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య కొంత కాలంగా అగాధం పెరుగుతూ వచ్చింది. గవర్నర్ తమిళిసై  సౌందర రాజన్ లపై మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

also read:సరూర్‌నగర్ పరువు హత్య: కేసీఆర్ సర్కార్ ను నివేదిక కోరిన తమిళి సై

తెలంగాణ గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య కొంత కాలంగా అగాధం పెరుగుతూ వచ్చింది. గవర్నర్ తమిళిసై  సౌందర రాజన్ లపై మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆమె ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిశారు. వారితో భేటీ అయిన తర్వాత తెలంగాణ సీఎంపై విమర్శలు చేశారు. తనను తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా అమానపరుస్తుందన్నారు.

తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ని కాదన్నారు.గవర్నర్ గా ఎవరున్నా కూడా  ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.రాజ్ భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదన్నారు. ఏ విబేధాలున్నా చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై చెప్పారు. పాత వీడియోలతో తనను ట్రోల్ చేశారని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు.ఏప్రిల్  6వ తేదీనే ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 7న కేంద్ర మోంశాఖ మంత్రి అమిత్ షాల ను ఆమె కలిశారు.  ఈ ఇద్దరితో భేటీ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారంగానే తాను నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కానీ అలా చేయడం టీఆర్ఎస్ సర్కార్ కు ఇబ్బందిగా మారితే తాను ఏం చేయలేనన్నారు. కేసీఆర్ ను తాను సోదరుడిగా భావించానన్నారు. కానీ తనను అవమానిస్తున్నారన్నారు. రాజ్ భవన్ కు ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలన్నారు.  గవర్నర్  చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. 

గత కొంతకాలంగా తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది. ఈ విబేధాలు ఇటీవల తారాస్థాయికి చేరకున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో కౌశిక్ రెడ్డిని పేరును కేబినెట్ సిఫారసు చేయగా.. గవర్నర్ దానికి ఆమోదం తెలుపలేదు. అప్పటి నుంచి గవర్నర్‌‌కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది.  గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. 

సమక్క సారక్క జాతరలో పాల్గొనడానికి వెళ్లిన గవర్నర్‌‌కు ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆహ్వానించడానికి రాలేదు. దీంతో ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఇప్పటికే కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. గవర్నర్ తమిళిసై హన్మకొండ, యాదాద్రి పర్యటనల సందర్భంగా మంత్రులు, అధికారులు ప్రోటోకాల్ పారించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలపై తమిళిసై వివిధ సందర్భాల్లో బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.

click me!